కారంపూడి మండలంలో స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం వ్యక్తిగత పరిశుభ్రత–సామాజిక పరిశుభ్రతపై అవగాహన

డైనమిక్, కారంపూడి, నవంబర్ 15 ప్రతినెల నిర్వహించే స్వచ్ఛ్ ఆంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం కారంపూడి మండల పరిధిలో పరిశుభ్రత ప్రచారం, శుభ్రత కార్యక్రమాలు, స్వచ్ఛ ప్రతిజ్ఞలు చేపట్టారు. ప్రభుత్వం సూచించిన “వ్యక్తిగత మరియు సమాజ పరిశుభ్రత” అంశంపై గ్రామాల్లో విస్తృతంగా అవగాహన సృష్టించారు. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన గ్రామాల్లో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, చేతులు సరైన విధంగా కడుక్కోవడం వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పాఠశాలల్లో, పంచాయతీల్లో, గ్రామ సభల్లో ప్రజలకు స్వచ్ఛ ప్రతిజ్ఞ చేయించారు. నాగులేరు మెట్ల వద్ద శుభ్రత కార్యక్రమం స్థానిక వీరులదేవాలయం వద్ద ఉన్న నాగులేరు మెట్లను పారిశుధ్య కార్మికులతో కలిసి స్వచ్ఛ...