అవని వడ్ల మిల్లులో తూకం మోసం ఆరోపణలువేబ్రిడ్జి కంటా లో క్వింటా తేడాతో రైతుల ధాన్యంపై దోపిడీ సీజన్‌లో తనిఖీలు చేయకపోవడం ఎవరి నిర్లక్ష్యం..? తూనికల శాఖ అధికారులు ఎక్కడ? కౌలు, చిన్న రైతులు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలి

డైనమిక్, నేరేడుచర్ల, నవంబర్ 15 నేరేడు చర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలోని అవని వడ్ల మిల్లు మోసం వెలుగు లోకి వచ్చింది. వడ్ల తూకంలో సిస్టమేటిక్‌గా క్వింటా తేడా చూపిస్తూ రైతుల ధాన్యాన్ని దోచుకుంటున్నారనే ఆరోపణలు చేస్తున్న రైతులు.రైతులు తాము తెచ్చిన ప్రతి బండి ధాన్యంలో ఒక క్వింటా చొప్పున తక్కువ చూపిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్వింటా తేడా… రైతుల కోపం ఉధృతం శనివారం ధాన్యం అమ్మిన కొండ ముసలయ్య, పేరం రాజు, కొండ సత్యనారాయణ, బొరుగుల లింగయ్య, కొండ శీను, జడ లింగయ్య, కంపసడి లక్ష్మయ్య లాంటి పలువురు రైతులకి ఒకే సమస్య ఎదురైంది.అవని మిల్లులో తూకం వేయగా ఒక్కో బండి...