వయోవృద్ధుల హక్కులపై 'వాక్‌థాన్'గాంధీ పార్కు నుంచి మినీ ట్యాంక్‌బండ్ వరకు అవగాహన ర్యాలీ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 15 అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం వారోత్సవాల సందర్భంగా సూర్యాపేట పట్టణంలో శుక్రవారం వయోవృద్ధుల హక్కులపై అవగాహన ర్యాలీ (Walkthon) నిర్వహించారు. గాంధీ పార్కు నుంచి మినీ ట్యాంక్‌బండ్ (సద్దల చెరువు) వరకు జరిగిన ఈ వాక్‌థాన్‌కు మంచి స్పందన లభించింది. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం ర్యాలీ ప్రారంభం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాల మేరకు జిల్లా సంక్షేమ అధికారి కె. నరసింహరావు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని ఆయన గుర్తుచేశారు. తల్లిదండ్రుల సంరక్షణ పిల్లల బాధ్యతే: సంక్షేమ అధికారి హెచ్చరిక పిల్లలు తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా...