గుర్తు తెలియని మృతదేహం కలకలం ఘటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహమృతదేహం వివరాల కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 15 సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల–ఖమ్మం జాతీయ రహదారిపై పిల్లలమర్రి శివారులో శనివారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న వెంటనే సూర్యాపేట రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ జిల్లా ఎస్పీ నరసింహ, సంఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. ఘటనపై పూర్తి వివరాలు సేకరించేందుకు సంబంధిత అధికారులతో కలిసి సమగ్ర విచారణ చేపట్టారు. మృతదేహానికి సంబంధించి సూర్యాపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు మృతుడి గుర్తింపు కోసం స్పెషల్ పోలీస్ టీమ్స్‌ను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.క్లూస్ టీమ్,...