పల్నాడు జిల్లాలో పర్యాటకాభివృద్ధి పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా
డైనమిక్, నరసరావుపేట, నవంబర్ 15 పల్నాడు జిల్లాలో పర్యాటక రంగాన్ని వేగంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్ కృతిక శుక్లా అధికారులుకు స్పష్టమైన దిశానిర్దేశాలు చేశారు. శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పర్యాటక శాఖ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యాటక ప్రాజెక్టుల పురోగతిపై ఆరా జిల్లాలో కొనసాగుతున్న పలు పర్యాటక ప్రాజెక్టులపై కలెక్టర్ ఒక్కో అంశం పై క్షుణ్ణంగా సమీక్షించారు.స్వదేశీ దర్శన్‌లో భాగంగా నాగార్జునసాగర్ సమీపంలో వరల్డ్ క్లాస్ బుద్ధిష్ట్ హెరిటేజ్ సెంటర్.అమరావతి 125 అడుగుల బుద్ధుని విగ్రహం ఆధునీకరణ,గుత్తికొండ బిలం రోడ్డు నిర్మాణ పనులు,ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ వద్ద జిప్ సైకిల్, జిప్ లైన్ ఏర్పాట్లు,ఈ పనుల పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలు అందించారు....