ప్లాస్టిక్ రహిత మంగళగిరి వైపు మరో అడుగు మార్కెట్ యార్డ్‌లో ఏటిబి మిషన్లను ప్రారంభించిన కూటమి నాయకులు
డైనమిక్ ,మంగళగిరి, నవంబర్ 15 ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించే దిశగామంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ చేపట్టిన ప్రయత్నాల్లో భాగంగా, మంగళగిరి మార్కెట్ యార్డ్‌లో ఏటిబి (ఎనీ టైం బ్యాగ్) మిషన్లను శనివారం కూటమి నాయకులు ప్రారంభించారు. రైతు బజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ మిషన్లు ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా పర్యావరణహిత బ్యాగుల వినియోగాన్ని ప్రోత్సహించనున్నాయి. పర్యావరణహిత బ్యాగుల వినియోగం అవసరం ఈ కార్యక్రమానికి స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ ఆరుద్ర భూలక్ష్మి, మంగళగిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మున్సిపల్ కమిషనర్ అలీంభాష, మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు నల్లగొండ పరమేశ్వరరావు, బైరబోయిన పద్మావతి, బైరబోయిన శ్రీనివాసరావు, బీజేపీ పట్టణ అధ్యక్షుడు...