పర్యావరణం, పరిశుభ్రత పరంపరగా మారాలి: చీఫ్‌ విప్ జీవీస్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జీవీ ఆంజనేయులు

డైనమిక్ న్యూస్, వినుకొండ, నవంబర్ 15 ప్రతి కుటుంబంలో పర్యావరణ స్పృహ, పరిశుభ్రత అనేవి కేవలం అలవాటు కాకుండా పరంపరగా మారాలని వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్‌ విప్ జీవీ ఆంజనేయులు పిలుపునిచ్చారు. భావితరాలకు ప్రశాంతమైన, ఆరోగ్యకరమైన సమాజాన్ని అందించాలంటే పరిశుభ్రత అత్యంత అవసరమని పేర్కొన్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటిన ఎమ్మెల్యే వినుకొండ–కారంపూడి రోడ్డులోని శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర, ‘మన పరిశుభ్రత–మన ఆరోగ్యం’ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీ ఆంజనేయులు విద్యార్థులు, సిబ్బందితో కలిసి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. “వైసీపీ పాలనలో చెత్త పన్ను… 80 లక్షల మెట్రిక్ టన్నుల...