కానిస్టేబుల్ కమలాకర్ మృతి బాధాకరం: జిల్లా ఎస్పీ నరసింహ

సూర్యాపేట బ్యూరో, నవంబర్ 16, డైనమిక్ న్యూస్ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్‌ శీలం కమలాకర్ మృతదేహానికి ప్రభుత్వ ఆస్పత్రిలో జిల్లా పోలీసు అధికారి నరసింహ పూలమాల అర్పించి నివాళులర్పించారు. “మంచి పోలీసు సహోదరుడిని కోల్పోయాం” — ఎస్పీ ఎస్పీ నరసింహ మాట్లాడుతూ—“కమలాకర్ మృతి చాలా బాధాకరం, దురదృష్టకరం. అతను ఉత్తమ సేవా రికార్డు కలిగిన కర్తవ్యనిష్ఠుడైన పోలీసు ఉద్యోగి. ఒక మంచి సిబ్బందిని పోలీసు కుటుంబం కోల్పోయింది” అని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబానికి అన్ని విధాలా తోడుంటాం కమలాకర్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.“అతని ఆశయాలు, ఆలోచనలు కొనసాగించే దిశగా చర్యలు తీసుకుంటాము” అని తెలిపారు.అప్రమత్తతతో విధులు నిర్వహించాలని...