హరీష్‌రావుపై అబద్దాలు మాట్లాడితే ఇక ఊరుకోం: బండ నరేందర్ రెడ్డి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్16 నల్గొండలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన పత్రికా సమావేశంలో మాజీ జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై తీవ్ర స్థాయిలో స్పందించారు. హరీష్‌రావుపై చేస్తున్న వ్యాఖ్యలు అసత్య ప్రచారమేనని, ఇక మౌనం ఉండబోమని హెచ్చరించారు. హరీష్‌రావుపై మాట్లాడే అర్హత కవితకు లేదు నరేందర్ రెడ్డి మాట్లాడుతూ— “హరీష్‌రావు రెండు వేల ఒకటవ సంవత్సరం నాటి తెలంగాణ ఉద్యమం నుంచి నిస్వార్థంగా పోరాడుతున్న నాయకుడు. అటువంటి నాయకుడి స్వభావంపై వ్యాఖ్యలు చేయడం కవిత పరిధిలోకి రాదు. నోరు అదుపులో పెట్టుకోవాలి” అన్నారు. ఉద్యమ సమయానికి హరీష్‌రావు పోరాటం, కవిత విదేశాల్లో ఉద్యమ పరిస్థితులను గుర్తుచేస్తూ— “హరీష్‌రావు రోడ్లపై...