సూక్మా జిల్లాలో తుపాకుల మోత… ముగ్గురు మావోయిస్టుల మృతి

హైదరాబాద్‌ , డైనమిక్ డెస్క్,నవంబర్ 16 చత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు చట్రం మరోసారి కదిలింది. అడవుల్లో భయానక కాల్పుల దాడులు చోటుచేసుకుంటుండగా, సూక్మా జిల్లాలో జరిగిన తాజా ఎన్కౌంటర్లో పోలీసులకు పెద్ద విజయమే లభించింది. మూడు మంది మావోయిస్టులు హతమైనట్లు సమాచారం. చింతగుఫా పరిధిలో ఉదయం ఘర్షణ అధికారుల ప్రకారం ఆదివారం ఉదయం చింతగుఫా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కరిగుండం అటవీ ప్రాంతంలో పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులు ప్రారంభించారు ప్రతిస్పందించిన భద్రతా దళాలు తిరుగుబాటు దళాలతో సుమారు గంటకు పైగా తూటాలు మార్పించుకున్నాయి. ఎన్కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు హతం ఈ భారీ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు సమాచారం....