బాపట్లకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సందర్శన సూర్యలంక బీచ్‌లో ఒకరోజు ప్రత్యేక పర్యటన పర్యటన పర్యవేక్షణ బాధ్యత జాయింట్ కలెక్టర్ భావనకు

డైనమిక్ న్యూస్, బాపట్ల, నవంబర్ 16 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ ఆదివారం ఉదయం ఒకరోజు పర్యటన నిమిత్తం బాపట్ల జిల్లాలోని పాండురంగాపురం చేరుకున్నారు. అనంతరం సూర్యలంక సముద్రతీరంలోని గోల్డెన్ సాండ్స్ ఫైవ్ స్టార్ హోటల్‌కు వెళ్లిన గవర్నర్‌ను జిల్లా కలెక్టర్ డా. వి. వినోద్ కుమార్, ఎస్పీ ఉమామహేశ్వర్, జాయింట్ కలెక్టర్ భావన పూలమొక్కలు అందజేసి సాదర స్వాగతం పలికారు. పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ భావనకు గవర్నర్ పర్యటన మొత్తం వ్యవహారాలు పర్యవేక్షించే బాధ్యతను జాయింట్ కలెక్టర్ భావన చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. గవర్నర్ ఏడీఎస్ తదితర సిబ్బందికి అవసరమైన గదులను ఏర్పాటు చేయాలని ఆర్‌డీఓ, తహశీల్దార్లను ఆదేశించారు. సెక్యూరిటీ,...