మిర్యాలగూడలో రేపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డీ లు రెండు శాఖల మంత్రుల భారీ పర్యటన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
డైనమిక్న్యూస్– నల్గొండ బ్యూరో, నవంబర్ 16 మిర్యాలగూడ పట్టణంలో రేపు (సోమవారం) పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభంకానున్నాయి. రాష్ట్ర రహదారులు, భవనాలు, చిత్రపట శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి సంయుక్తంగా ఈ కార్యక్రమాల్లోపాల్గొననున్నారని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రకటించారు. ఉదయం 9.50 నుంచి 12.15 వరకు పర్యటన మంత్రులు ముందుగా శెట్టిపాలెం–అవంతిపురం మార్గంలో 74 కోట్ల రూపాయలతో పూర్తిచేసిన రహదారిని ప్రారంభిస్తారు. అనంతరం 15 కోట్ల రూపాయలతో చేపట్టిన రహదారిని, 16 కోట్ల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రహదారులు, మురికి కాలువలను ప్రారంభించనున్నారు. పట్టణంలో సౌకర్యాల విస్తరణ మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో...