పత్తి కొనుగోళ్లపై జిల్లా కలెక్టర్ సమీక్ష జిన్నింగ్ మిల్లుల సమ్మె విరమించాలి: కలెక్టరు ఇలా త్రిపాఠి సూచన
నల్లగొండ బ్యూరో, డైనమిక్, నవంబర్ 16 నల్గొండలో పత్తి కొనుగోళ్ల పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ అధికారులు మరియు జిన్నింగ్ మిల్లుల యజమానులతో జరిగిన ఈ సమావేశంలో పత్తి కొనుగోలు వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించే దిశగా చర్చించారు. సమ్మె ఉపసంహరణ కోరిన కలెక్టర్ పత్తి రైతులు ఇబ్బందులు పడకూడని దృష్ట్యా సోమవారం నుండి యాజమాన్యం చేపట్టాలని భావించిన సమ్మెను విరమించుకోవాలని కలెక్టర్ జిన్నింగ్ మిల్లుల యజమానులను కోరారు.మిల్లుల యజమానులు ప్రస్తావించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చూపుతామని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయ–సహకార శాఖ సెక్రటరీ...