మధుమేహ బాధితులు గుండె సమస్యలను తొలి దశలోనే గుర్తించాలి : డాక్టర్ షేక్ మౌలాలి – గుండెజబ్బులపై శాస్త్రీయ అవగాహన సదస్సులో నిపుణుల సందేశం

డైనమిక్ న్యూస్, గుంటూరు, నవంబర్ 16 మధుమేహం ఉన్నవారిలో గుండె సంబంధిత వ్యాధులు ఇతరుల కంటే ముందుగానే, ఎక్కువ శాతంలో ప్రబలు తాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ షేక్ మౌలాలి హెచ్చరించారు. రక్తంలో చక్కెరని మాత్రమే నియంత్రణలో ఉంచుకోవడం సరిపోదని, గుండె ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. “మధుమేహం ఒక్క అవయవానికి మాత్రమే కాదు… శరీరమంతటికీ వ్యాపించే వ్యాధి” ఆదివారం బ్రాడీపేటలోని ఎస్‌హెచ్‌ఓ మీటింగ్ హాల్లో సర్వీస్ హెల్త్ ఆర్గనైజేషన్ హైపర్‌టెన్షన్ అండ్ డయాబెటిక్ క్లబ్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ‘గుండెజబ్బుల శాస్త్రీయ అవగాహన సభ–ఉచిత వైద్య సలహా శిబిరం’లో ఆయన ప్రసంగించారు.సభకు డాక్టర్...