బక్కయ్యగూడెం రేషన్ షాప్‌లో నాసిరక సన్నబియ్యం కలకలం లబ్ధిదారుల్లో ఆందోళన – అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్,నవంబర్ 17 రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సన్నబియ్యం నాణ్యతపై మరోసారి ప్రశ్నార్థక చిహ్నం నెలకొంది. బక్కయ్యగూడెం రేషన్ షాప్‌లో నవంబర్ నెల పంపిణీ సమయంలో నాసిరకం బియ్యం బయటపడటంతో గ్రామంలో కలకలం రేగింది. బియ్యం తీసుకోవడానికి వచ్చిన లబ్ధిదారు సంచిని తెరిచి చూడగా, ఒకబస్తాలో పురుగులు, బూజు, బియ్యపు ఉండలు కనిపించడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత తనిఖీలలో పౌర సరఫరా అధికారుల వైఫల్యం గ్రామస్థులు పేర్కొన్న వివరాల ప్రకారం — రేషన్ షాపులకు వచ్చే బియ్యం నాణ్యతను పౌర సరఫరా సప్లై అధికారులు సరిగా పరిశీలించడం లేదని, చాలా సార్లు తరుగు పై ఫిర్యాదులు చేసినా ఎలాంటి స్పందన...