తెలంగాణ విజయ డైరీకి మూడు కొత్త వాహనాలు ప్రారంభం చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి చేతుల మీదుగా జెండా ఊపి ప్రారంభం

హైదరాబాద్, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్17 తెలంగాణ విజయ డైరీ పాల ఉత్పత్తుల సరఫరాను మరింత వేగవంతం చేయడానికి మూడు నూతన వాహనాలను రాష్ట్ర డైరీ కార్పొరేషన్ సోమవారం సేవలోకి తీసుకొచ్చింది. విజయ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి, యం.డి చంద్రశేఖర్ రెడ్డితో కలిసి వాహనాలకు జెండా ఊపి ప్రారంభించారు. విజయ భవన్ నుంచి మూడు మార్గాలకు పంపిణీ వాహనాలు ఆదిలాబాద్, సిద్దిపేట, వరంగల్ మార్గాల్లో పాల ఉత్పత్తుల సరఫరా కోసం ఉపయోగించనున్నారు. దీంతో గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు పాల ఉత్పత్తులు వేగంగా, నాణ్యతతో చేరేలా ప్రయత్నాలు చేపట్టినట్టు అధికారులు తెలిపారు. పంపిణీ వ్యవస్థ విస్తరణపై చైర్మన్ దృష్టి తెలంగాణ...