ప్రజావాణి పిర్యాదులకు తక్షణ పరిష్కారం — కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశాలు
సూర్యాపేట బ్యూరో, డైనమిక్, నవంబర్ 17 సూర్యాపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ప్రజల నుండి పిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి పిర్యాదుపై అధికారులు అత్యవసరంగా స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. “వారం రోజుల్లో స్టేటస్ రిపోర్ట్ తప్పనిసరి” కలెక్టర్ పవార్ మాట్లాడుతూ — ప్రతి శాఖ అధికారి ప్రజావాణికి తప్పకుండా హాజరుకావాలి.శాఖల వారీగా పిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.వచ్చే వారం రోజుల్లో ప్రజావాణి పిర్యాదుల స్థితిపై రివ్యూ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.అలాగే కోర్టుల్లో పెండింగ్ లో...