మిర్యాలగూడలో రూ.171.5 కోట్ల అభివృద్ధి పనులకుశంకుస్థాపనలు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబాటు — మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, వెంకట్ రెడ్డీ
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్,నవంబర్ 17 మిర్యాలగూడ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తంకుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో రూ.171.5 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. రూ.171.5 కోట్ల ప్రాజెక్టులు ప్రారంభం శెట్టిపాలెం–అవంతిపురం నాలుగు లైన్ల రహదారి నిర్మాణం — రూ.74 కోట్లు,టీఎఫ్‌యూడీఎఫ్సీ నిధులతో రహదారులు — రూ.15 కోట్లు,సీసీ రోడ్లు, మురికికాలువల పనులు — రూ.16 కోట్లు,మున్సిపాలిటీ పరిధిలో బీటీ–సీసీ రోడ్లకు...