నేరేడుచర్ల సీసీ రోడ్డు మధ్యలో మిషన్ భగీరథ పైపులే చర్చనీయాంశంసీసీ రోడ్డు నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం ప్రజల్లో ఆగ్రహం
నేరేడుచర్ల, నవంబర్ 17, డైనమిక్ న్యూస్ నేరేడుచర్ల మున్సిపాల్టీ పరిధిలో శిశు మంది స్కూల్ నుండి కనకదుర్గ ఆలయం వరకు కిలోమీటరు మేర చేపడుతున్న సీసీ రోడ్డు పనుల్లో నడిరోడ్డు మధ్య భాగంలోనే మిషన్ భగీరథ పైపు లైన్‌లు అడ్డుపడటం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ సీసీ రోడ్డు వేస్తున్న సమయంలోనే పైపులు అలాగే ఉండటం ప్రజలను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. సీసీ రోడ్డుకు సెంటర్‌లోనే అడ్డుపడుతున్న పైపులు 50 ఫీట్ల వెడల్పున్న ఈ రహదారిలో ఇరువైపులా 13 ఫీట్లు వదిలి మధ్యలో 24 ఫీట్లలో సీసీ రోడ్డు వేస్తున్నారు. అయితే ఈ సెంటర్ భాగంలోనే మిషన్ భగీరథ వాటర్...