ఆడబిడ్డ సంరక్షణ అందరి బాధ్యత — జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆడపిల్లలపై పెరుగుతున్న ప్రమాదకర సంఘటనలు ఆందోళనకరం
నల్గొండ బ్యూరో, నవంబర్ 17 , డైనమిక్ న్యూస్ జిల్లాలో ఇటీవల ఆడపిల్లల అక్రమ దత్తత, బాల్య వివాహాలు, లింగ నిర్ధారణ పరీక్షలు, చిన్న వయసులో గర్భం దాల్చడం వంటి సంఘటనలుప్రబలుతున్నాయని, ఇవి అత్యంత ఆందోళనకరమని జిల్లా కలెక్టర్ ఇలాఏ త్రిపాఠి తెలిపారు. విసిపిసి కమిటీలకు బలం — ప్రతి గ్రామంలో తప్పనిసరి సమావేశాలు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన “సేవ్ ద చైల్డ్” జిల్లా స్థాయి సమావేశంలో మాట్లాడుతూ గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను (VSCPC) బలోపేతం చేయాలని, పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ టీచర్, గ్రామపాలన అధికారులను చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులుగా నియమించాలని ఆదేశించారు.లింగ నిర్ధారణ పరీక్షలను అరికట్టేందుకు ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు...