24 గంటల్లో సీఎం స్పందించాలి — న్యాయవాది దానక్క సంగమేశ్వర్ అల్టిమేటం
రంగారెడ్డి జిల్లా, డైనమిక్ న్యూస్, నవంబర్ 18 షాద్‌నగర్‌లో దళిత యువకుడు ఎర్ర రాజశేఖర్‌పై అగ్రవర్ణస్తులు చేసిన కుల దురహంకార హత్యపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం తీవ్ర ఆందోళనకరమని షాద్‌నగర్ న్యాయవాది, యువ నాయకుడు దానక్క సంగమేశ్వర్ మంగళవారం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 24 గంటల్లోగా స్పందించాల్సిందే అని డిమాండ్ చేశారు. రాజశేఖర్ హత్యపై ప్రభుత్వ మౌనం విచారం కలిగిస్తోంది ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్‌ను దారుణంగా హత్య చేసి శవాన్ని దహనం చేసిన ఘటనపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయకపోవడం ఆశ్చర్యకరమని సంగమేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ ఘటనపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా నోరు విప్పకపోవడం...