చదువుతోనే అన్ని సాధ్యం : కలెక్టర్ ఇలా త్రిపాఠి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినులకు స్పూర్తిదాయక సందేశం ఇచ్చారు. బుధవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇందిరాగాంధీ జయంతికి నివాళులు కార్యక్రమం ప్రారంభంలో స్వర్గీయ భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాల అర్పించారు.ఆమె దేశాభివృద్ధికి అందించిన సేవలను స్మరించుకున్నారు. కష్టపడి చదివితేనే ఉన్నత స్థానం : కలెక్టర్ విద్యార్థినులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇందిరాగాంధీ కఠోర శ్రమ, పట్టుదలతో ప్రధానమంత్రి స్థాయికి చేరుకున్నారని,ప్రజల సంక్షేమార్థం “గరీబీ హఠావో” వంటి పథకాలు ప్రవేశపెట్టిన దూరదృష్టి...