జిల్లాలో ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీని విజయవంతం చేయాలి: కలెక్టర్ త్రిపాఠి

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిర మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమాన్ని నల్గొండ జిల్లాలో సమర్థంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులపై ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సీఎం ఏ. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ — కీలక సూచనలు చేశారు.వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ మహిళా శక్తికరణపై చేపడుతున్న ముఖ్య పథకాలను విశదీకరించారు. సీఎం ముఖ్యాంశాలు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా కోటి మహిళలకు కోటి చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభం,ఆడబిడ్డలకు సారె,...