వయోవృద్ధుల సంక్షేమం ప్రభుత్వ ప్రాధాన్యం : జిల్లా రెవెన్యూ అధికారి అశోక్ రెడ్డి ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవం ముగింపు ఘనంగా నిర్వహించిన కార్యక్రమం
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నవంబర్ 12 నుండి 19 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వారోత్సవ కార్యక్రమాలు ఘనంగా ముగిశాయి. చివరి రోజు బుదవారం సమావేశాన్ని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా రెవెన్యూ అధికారి వై. అశోక్ రెడ్డి మాట్లాడుతూ, “వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఆసరా పెన్షన్‌తో పాటు మెరుగైన జీవన విధానం కోసం అవసరమైన సౌకర్యాలను అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి” అని తెలిపారు. వృద్ధుల కోసం ఉచిత ఆశ్రమం – త్వరలోనే దిన సంరక్షణ కేంద్రం...