పల్నాటి ఉత్సవాల్లోపాల్గొన్న ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి – తనయుడు వివేకానందరెడ్డి పౌరుష సంప్రదాయాలకు ప్రతీక పల్నాటి ఉత్సవాలు అంకాళమ్మ, చెన్నకేశవ దేవాలయాల్లో ఘన పూజలు పల్నాటి యుద్ధంలో వీరులు వాడిన కొనతలను పరిశీలన రాష్ట్రస్థాయి ఎడ్లపందెం రెండవ రోజు కార్యక్రమా

కారంపూడి, నవంబర్ 19, డైనమిక్ న్యూస్ పల్నాటి వీరుల పరాక్రమాన్ని స్మరించుకుంటూ నిర్వహించే వార్షిక కారంపూడి వీరారాధన ఉత్సవాలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఆయన తనయుడు సాయి వివేకానందరెడ్డి కలిసి పాల్గొన్నారు. దేవాలయాల్లో ప్రత్యేక పూజలు ఉత్సవాల ప్రారంభ కార్యక్రమంగా అంకాళమ్మ, చెన్నకేశవస్వామి మరియు వీరుల దేవాలయాల్లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు పూర్ణకుంభ స్వాగతం అందించారు. పల్నాటి చరిత్ర మహోన్నతం – ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ “పల్నాటి చరిత్ర పౌరుషానికి ప్రతీక. రోమ్ దేశం తర్వాత వీరారాధన ఉత్సవాలు ఈ స్థాయిలో జరిగేది కారంపూడిలోనే. ఐదు రోజులపాటు జరిగే...