కోదాడ లాకప్ డెత్‌పై జేఏసీ రాస్తారోకోనల్ల కండువాలతో మోకాళ్లపై వినూత్న నిరసన
నేరేడుచర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 19 కోదాడ లాకప్ డెత్ కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ–ఎస్సీ–ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో నేరేడుచర్ల ప్రధాన కూడలిలో మోకాళ్లపై రాస్తారోకో నిర్వహించారు. నల్ల కండువాలు ధరించి చిలుకూరు ఎస్సై, కోదాడ సీఐల అత్యుత్సాహం వల్ల కర్ల రాజేష్ మృతి చెందాడని నేతలు ఆరోపించారు. అనుమానితుడిగా అరెస్టు… వారం రోజుల హింస తర్వాత మృతి : నేతల ఆరోపణ జేఏసీ నాయకులు మాట్లాడుతూ — ఎలాంటి స్పష్టమైన నేరం లేకుండా కేవలం అనుమానితుడి గా రాజేష్‌ను అరెస్టు చేసి వారం రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. ఆరోగ్యం బాగా లేకపోయినా రిమాండ్‌కు తరలించడంతో పరిస్థితి విషమించి...