స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీపై చర్చ
నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 20 హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జనసేన రాష్ట్ర కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పోటీపై కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర జనసేన అధ్యక్షుడు శంకర్ గౌడ్ అధ్యక్షత వహించారు. తెలంగాణలో జనసేనకు పెరుగుతున్న ఆదరణ ఆంధ్రప్రదేశ్‌లో పవన్ కళ్యాణ్ సాధించిన ఎన్నికల విజయంతో తెలంగాణలో కూడా జనసేనకు మంచి ఆదరణ ఏర్పడిందని నేతలు తెలిపారు. ఈ బలంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ ధైర్యంగా పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ గౌడ్ స్పష్టం చేసినట్లు సమాచారం. అభ్యర్థుల ఆసక్తి పెరుగుతుంది స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి...