2030 వరకు పేదలకు ఉచిత బియ్యం పథకం కొనసాగింపు — కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి 80 కోట్ల మందికి నెలకు 5 కిలోల బియ్యం పంపిణీ : ప్రపంచంలోనే అతి పెద్ద ఆహార భద్రత పథకం

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 20 నల్గొండలో నూతనంగా నిర్మించిన భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) డివిజనల్ కార్యాలయాన్ని గురువారం కేంద్ర ఆహార, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పలు కీలక విషయాలను వెల్లడించారు. కోవిడ్ సమయంలో ఆకలిబాధ నివారణకు చారిత్రక నిర్ణయం కేంద్ర మంత్రి మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి సమయంలో ఒక్కరూ ఆకలితో చనిపోకుండా 80 కోట్ల పేదలకు నెలకు 5 కిలోల చొప్పున బియ్యం ఉచితంగా అందజేస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని 2030 వరకు కొనసాగించాలనే నిర్ణయం ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్నారని చెప్పారు.ప్రపంచంలోని ఆస్ట్రేలియా,...