మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరునేడు పల్నాటి ఉత్సవాల్లో కీలక కార్యక్రమంచాపకుడు కార్యక్రమానికి పల్నాడు జిల్లా అధికారుల రాక
డైనమిక్ న్యూస్, కారంపూడి, నవంబర్ 21 పల్నాటి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు శుక్రవారం మందపోరు, చాపకుడు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించనున్నారు. సమసమాజ స్థాపన కోసం బ్రహ్మనాయుడు చేపట్టిన చాపకుడు కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం దేవాలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా చేస్తూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల, ఎస్పీ కృష్ణరావు, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే జివి ఆంజనేయులు, నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు తదితర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. మలిదేవాదులను చీకాకుపరచాలనే నాగమ్మ యత్నాలు కోడి పందెంలో ఓటమి తర్వాత బ్రహ్మనాయుడు నేతృత్వంలో మలిదేవాదులు మందాడికి చేరి గోసంపదతో ఆనందంగా జీవిస్తున్నారన్న సమాచారం...