డిజిటల్ యుగంలో పెరుగుతున్న ముప్పులు… పౌరులు అప్రమత్తమే ఆయుధం— ఎస్పీ కె. నరసింహ డిజిటల్ సాంకేతికత… వరమా? శాపమా?
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 21 డిజిటల్ యుగం ప్రపంచాన్ని అరచేతిలోకి తెచ్చేసినా, కనిపించని కొత్త సవాళ్లను కూడా తెచ్చిందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ తెలిపారు.నమ్మదగినట్లుగా కనిపించే నకిలీ లింకులు, పెట్టుబడి మోసాలు, వర్చువల్ వ్యసనాలు ప్రజలను ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీస్తున్నాయని పేర్కొన్నారు. బెట్టింగ్ వ్యసనం… కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తోంది ఆన్‌లైన్ బెట్టింగ్ చిన్న మొత్తాలతో ప్రారంభమై వ్యసనంగా మారుతుందని, అప్పుల్లో కూరుకుపోయి ప్రాణాలు తీసుకున్న సంఘటనలు పెరుగుతున్నాయని ఎస్పీ హెచ్చరించారు.“బెట్టింగ్ డబ్బు సంపాదించే మార్గం కాదు” అని పౌరులు గుర్తుంచుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. డీప్‌ఫేక్‌లు, రొమాన్స్ స్కాములు… కొత్త భయాలు సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు, వీడియోలను దుర్వినియోగం చేసి...