కారంపూడి వీరోత్సవాల్లో నేతల వ్యాఖ్యలుపల్నాడు – అన్యాయంపై పోరాట సంస్కృతి ప్రతీక
డైనమిక్ న్యూస్,కారంపూడి, నవంబర్ 22 పల్నాడు అన్యాయానికి ఎదురు నిలిచిన చారిత్రక నేల అని నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. కారంపూడి వీరుల మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన కోడిపోరు ఉత్సవంలో పాల్గొని, అనంతరం ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అన్యాయంపై పోరాటమే పల్నాటి యుద్ధం – ఎంపీ లావు 11వ శతాబ్దంలోనే అన్యాయాలపై తిరుగుబాటు చేసి యుద్ధానికి దారి తీసిన ఘనత పల్నాడుదేనని ఎంపీ లావు గుర్తుచేశారు. వైసీపీ పాలనలో జిల్లాలో నెలకొన్న ఘర్షణ వాతావరణం నేడు అభివృద్ధి దిశగా మారిందని పేర్కొన్నారు. పర్యావరణ అనుమతులు అందిన వెంటనే వరికిపూడిశెల పనులు ప్రారంభమవుతాయని, అన్ని అనుమతులు త్వరలోనే లభిస్తాయని తెలిపారు....