పనుల నాణ్యతలో రాజీ పడకూడదు గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ మాయాబజారులో పరిశీలన

గుంటూరు, డైనమిక్ న్యూస్, నవంబర్ 23 గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మరియు అసెంబ్లీ మైనారిటీస్ కమిటీ చైర్మన్ నసీర్ అహమ్మద్ ఆదివారం మాయాబజారు లోని జీటీ రోడ్డులో నిర్మాణంలో ఉన్న సీసీ డ్రెయిన్ పనులను పరిశీలించారు. అభివృద్ధి పనులపై కఠిన పర్యవేక్షణ ఎమ్మెల్యే నసీర్ అహమ్మద్ కార్యదర్శులతో కలిసి నిర్మాణ స్థలానికి వెళ్లి, పనులు ఎంత దాకా పూర్తయ్యాయో, ఎప్పుడు పూర్తి చేయాలన్న గడువులు, వినియోగిస్తున్న మెటీరియల్ పరిమాణం, నాణ్యత ప్రమాణాలు వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వర్షాల్లో ఇబ్బందులు నివారణ ఎమ్మెల్యే మాట్లాడుతూ, “వర్షాలు కురిస్తే మాయాబజారు జీటీ రోడ్డులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే సీసీ డ్రెయిన్ నిర్మాణం...