కారంపూడిలో ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమంరైతులతో మమేకమైన టీడీపీ నేతలు, వ్యవసాయ అధికారులు
కారంపూడి, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 కూటమి ప్రభుత్వం చేపట్టిన ప్రతిష్టాత్మక ‘రైతన్నా మీకోసం’ కార్యక్రమం భాగంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మార్గదర్శకత్వంలో టీడీపీ నాయకులు, వ్యవసాయ శాఖ అధికారులు కారంపూడి గ్రామంలో రైతులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులే ప్రభుత్వ లక్ష్యం మండల టీడీపీ అధ్యక్షులు గోళ్ళ సురేష్ యాదవ్ మాట్లాడుతూ —రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన పరిజ్ఞానం, శాస్త్రీయ విధానాల ద్వారా అధిక దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల అండ రైతులకు మరింత...