ప్రజావాణి పిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ సీతారామారావు

సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 జిల్లాలో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయి ప్రజావాణి పిర్యాదులపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వెంటనే పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ కె. సీతారామారావు ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు. పెండింగ్ పిర్యాదులపై హెచ్చరిక జిల్లా, డివిజన్, మండల కార్యాలయాల్లో చాలా కాలంగా పిర్యాదులు పెండింగ్‌లో ఉన్నందున, ప్రతి శాఖ అధికారులు ప్రత్యేక సమయం కేటాయించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. వారం రోజుల్లో రాష్ట్ర, జిల్లా స్థాయి పిర్యాదు స్థితిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు. కార్మిక భీమా పెంపు పోస్టర్ ఆవిష్కరణ...