జిల్లా ఆరోగ్య కార్యక్రమాలపై సమీక్ష చేపట్టిన డి.యం.హెచ్.ఒ. డాక్టర్ పుట్ల శ్రీనివాస్టి.ఎన్.జి.ఓ. భవనంలో విస్తృత సమావేశం
నల్గొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈరోజు టి.ఎన్.జి.ఓ. భవనంలో ఆరోగ్య కార్యకలాపాలపై విస్తృత సమీక్షా సమావేశం జరిగింది. డి.యం.హెచ్.ఒ. డాక్టర్ పుట్ల శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించిన ఈ సమావేశానికి అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఎంఎల్హెచ్‌పీలు, విభాగ ప్రోగ్రాం అధికారులు హాజరయ్యారు. ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి సమావేశంలో ఆధార్ ఆధారిత అటెండెన్స్ అమలుపై డాక్టర్ శ్రీనివాస్ తీవ్రంగా స్పందించారు. హాజరు వ్యవస్థలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. అసంక్రమిత వ్యాధుల నియంత్రణ – ఉత్తమ పీహెచ్‌సీలకు అభినందనలు అసంక్రమిత వ్యాధుల నియంత్రణలో పది పీహెచ్‌సీలు మంచి పనితీరు కనబరిచినందుకు డి.యం.హెచ్.ఒ. అభినందించారు. పనితీరులో...