ప్రజా సమస్యలను సత్వరం పరిష్కరించే దిశగా పోలీస్ గ్రీవెన్స్ డే – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గ్రీవెన్స్ డేలో 33 మంది ఫిర్యాదుదారుల వినతులుస్వీకరణ

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 33 మంది అర్జీ దారులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేరుగా కలుసుకున్నారు. వారి సమస్యలను వివరంగా తెలుసుకుని వినతులు స్వీకరించారు. అధికారులకు ఎస్పీ ఆదేశాలు: వేగంగా స్పందించండి ప్రజలు తెలిపిన ప్రతి ఫిర్యాదుపై తక్షణం స్పందించి, సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరగకుండా చూడాలని సంబంధిత అధికారులకు ఎస్పీ సూచించారు. పోలీసు సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో గ్రీవెన్స్ డే అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పోలీస్ సేవల్లో పారదర్శకత–సమర్థతే లక్ష్యం ప్రతి ఫిర్యాదుదారునికి...