ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించండి జిల్లా ఎస్పీ బి. కృష్ణా రావు

నరసరావుపేట, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా తక్షిణ చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ బి.కృష్ణా రావు అధికారులకు ఆదేశించారు.పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్సీ బి.కృష్ణా రావు పాల్గొని, ప్రజల నుండి ఫిర్యాదును స్వీకరించారు. ఈ ప్రజా సమస్యల పరిధిలో కార్యక్రమంలో ప్రజల నుండి కుటుంబ ఆర్ధిక,ఆస్తి తగాదాలు, మోసం మొదలగు ఆయా సమస్తలకు సంబంధించి 111 ఫిర్యాదులు అందాయి.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఫిర్యాదుదారుని సమస్య పట్ల శ్రద్ధ వహించి, నిర్ణీత...