గత పాలకులు సాగును నిర్లక్ష్యం చేసి తమ బాగుపై శ్రద్ధ పెట్టారు…ఎం ఎల్ ఏ పత్తిపాటి పుల్లారావు…
నరసరావుపేట, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 మారుతున్న కాలానికి, ఆహారపు అలవాట్లకు తగినట్టుగా రైతులు తమ సాగు విధానాలు, పైర్ల ఎంపికను మార్చాల్సిన సమయం వచ్చింది.ఫుడ్ ప్రాసెసింగ్ విధానంతో రైతులు తమ ఉత్పత్తులకు అధిక ధరలు పొందవచ్చు.చంద్రబాబు ఉన్నందునే సకాలంలో రైతుల ఉత్పత్తులు కొనుగోళ్లు, మద్ధతు ధర సాధ్యమైంది. రైతన్నా మీకోసం కార్యక్రమంలో మాజీమంత్రి ఎం ఎల్ ఏ ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నందునే సకాలంలో రైతుల ఉత్పత్తుల కొనుగోళ్లు, మద్ధతు ధరల అమలు సాధ్యమైందని, నూతన సాగు విధానాలతో రాష్ట్ర వ్యవసాయరంగాన్ని దేశానికే ఆదర్శంగా నిలపాలన్న గట్టి పట్టుదలతో సీఎం ఉన్నారని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. సోమవారం ఆయన నాదెండ్ల మండలంలో...