కురగల్లు, మంగళగిరి సోసైటీలో భారీ కుంభకోణం వెలుగులోకి. కురగల్లు పీఏసీఎస్ లో రూ. 7.77కోట్లు, మంగళగిరి పీఏసీఎస్ లో రూ. 2.46కోట్లు గోల్ మాల్ కీలకసూత్రధారి కురగల్లు సీఈఓ రమేష్ మంత్రి నారాలోకేష్ ఆదేశాలతో కొనసాగుతున్న సమగ్ర దర్యాప్తు సొసైటీల్లో అక్రమాలపై కొనసాగు
మంగళగిరి , డైనమిక్ న్యూస్, నవంబర్ 24 మంగళగిరిలో ప్రాథమిక సహకార సంఘాలు (పీఏసీఎస్ లు) అవినీతి, అక్రమాలకు నిలయాలుగా మారుతున్నాయి. రైతులకు చేయూతనివ్వాల్సిన పీఏసీఎస్ లు వారిని దోచుకుంటున్నాయి. ఉన్నతాధికారులు సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతుంది. మంగళగిరి మండలం కురగల్లు, మంగళగిరి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో గత రెండు రోజుల క్రితం భారీ అవినీతి వెలుగు చూసిన విషయం విదితమే. పీఏసీఎస్ సీఈఓ రమేష్ రైతులకు నకిలీ ఫిక్సిడ్ డిపాజిట్ బాండ్లను ఇచ్చి మొత్తం షుమారు రూ.10.23కోట్ల ను వసూలు చేసి ఆ డబ్బును బ్యాంకులో జమ చేయలేదు. మంగళగిరి పీఏసీఎస్ కు సైతం...