పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులకు అనుమతి జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్

బాపట్ల, డైనమిక్ న్యూస్, నవంబర్ 24 పర్యావరణ అనుమతులు, వాల్టా చట్టం ఆధారంగా ఇసుక రేవులు అనుమతించాల్సి ఉందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, తెలిపారు. జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టరేట్ లో జరిగింది. కృష్ణ నది పరివాహక ప్రాంతాలలో ఇసుక లభ్యత ఉందని కలెక్టర్ చెప్పారు. కొల్లూరు మండలం జువ్వలపాలెం ఇసుక రేవులో 14.960 హెక్టార్ల ఇసుక లభ్యత ఉందని స్పష్టం చేశారు. స్థానికుల నుంచి ప్రజాభిప్రాయ సేకరణ తదుపరి ఆ ప్రాంతం నుంచి ఇసుక తవ్వడానికి అనుమతి ఉంటుందన్నారు. ప్రజా అభిప్రాయ సేకరణ నిబంధన అనుసరించి వేగంగా చేపట్టాలన్నారు. ఓలేరు రేవులో ఇసుక తవ్వకాలు జరపడానికి...