తండ్రి అనుమతి లేకుంటే కొడుకు ఇంట్లో నివసించే హక్కు లేదు: రాజస్థాన్ హైకోర్టు

జైపూర్, డైనమిక్ న్యూస్ డెస్క్, నవంబర్24 తండ్రి అనుమతి లేకుండా ఆయన ఇంట్లో కొడుకు నివసించేందుకు ఎలాంటి హక్కు ఉండదని రాజస్థాన్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సవాయ్ మాధోపూర్‌ జిల్లాకు చెందిన తండ్రి–కొడుకుల మధ్య నెలకొన్న ఆస్తి, కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది.తన బాగోగులు పట్టించుకోవటం లేదని ఆరోపిస్తూ, కొడుకు–కోడలిని ఇంటి నుంచి వెళ్లిపోవాలని తండ్రి కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు, తండ్రి అనుమతి లేకుండా కొడుకు పితృగృహంలో ఉండటం చట్టపరంగా సమంజసం కాదని స్పష్టం చేసింది. కొడుకు వాదనలను తోసిపుచ్చిన కోర్టు, ఇంటి యజమానికి తన ఆస్తిపై పూర్తి హక్కు ఉంటుందని, అనుమతి నిరాకరించిన సందర్భంలో ఎవరూ...