నూతన కార్మిక కోడ్‌లను రద్దు చేయాలని ఎంఆర్ఎస్ సంఘం డిమాండ్

నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 25 కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన కార్మిక కోడ్‌లను రద్దుచేసి, పాత కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నల్లగొండ మెడికల్ రిప్రెజెంటేటివ్ సంఘం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించింది. ఈ కార్యక్రమం మంగళవారం నల్లగొండలో జరిగింది. “కొత్త కోడ్‌ల వల్ల జీవితం అగమ్యగోచరం” — పాల్వాయి హరిప్రసాద్ మెడికల్ రిప్రెజెంటేటివ్‌లకు కొత్త కార్మిక కోడ్‌లు అనేక సమస్యలను తెచ్చిపెడుతున్నాయని, ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతోందని జిల్లా సంఘం అధ్యక్షుడు పాల్వాయి హరిప్రసాద్ అన్నారు.పాత చట్టాలు కార్మికులకు రక్షణగా నిలిచేవని, వాటిని తిరిగి అమల్లోకి తేవాలని ఆయన కలెక్టర్‌ను కోరారు. కలెక్టర్‌కి మెమొరాండం సమర్పణ కొత్త కార్మిక కోడ్‌ల...