నామినేషన్ ప్రక్రియ సజావుగా జరగాలి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశం

సూర్యాపేట బ్యూరో , డైనమిక్ న్యూస్ నవంబర్ 27 గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా రిటర్నింగ్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. నామినేషన్ కేంద్రాల పరిశీలన గురువారం నూతనకల్ మండల కేంద్రంలోని ఎం.ఆర్.సి భవనం, మిర్యాల గ్రామ పంచాయతీ కార్యాలయం, ఆత్మకూర్ (ఎస్) మండలం ఏపూరు గ్రామ పంచాయతీ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను జిల్లా ఎస్పీ కె. నరసింహతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గ్రామాల వారీగా నామినేషన్ స్వీకరణ నూతనకల్ ఎం.ఆర్.సి భవనంలో నూతనకల్, వెంకేపల్లి, యడవల్లి, చిల్పకుంట్ల గ్రామ పంచాయతీల సర్పంచ్‌లు మరియు...