రౌడీషీటర్లకు పోలీసుల కౌన్సిలింగ్ ప్రవర్తన మార్చుకుని మంచి పౌరులుగా మారాలి : సీఐ సిహెచ్ ప్రభాకర్ రావు

డైనమిక్ న్యూస్, నరసరావుపేట, నవంబర్29 నరసరావుపేట రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లకు శనివారం పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రెండవ పట్టణ సీఐ సిహెచ్ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకొని బాధ్యతాయుత పౌరులుగా జీవించాలని సూచించారు. అసాంఘిక కార్యకలాపాలు, చట్టవ్యతిరేక చర్యలు, దౌర్జన్యాలు, రౌడీయిజానికి పాల్పడినట్లు సమాచారం అందితే చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిరంతర నిఘా కొనసాగుతుంది రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు ఎల్లవేళలా నిఘా ఉంచుతారని తెలిపారు. ప్రశాంత వాతావరణాన్ని భంగం కలిగించే ప్రయత్నాలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు....