అభ్యర్థులు నామినేషన్ సమయానికి అవసర పత్రాలు సమర్పించవచ్చని జిల్లా కలెక్టర్ సూచన
నల్లగొండ బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 29 జిల్లా కలెక్టర్ త్రిపాఠి అభ్యర్థులు నామినేషన్ వేస్తున్నప్పుడు బ్యాంక్ ఖాతా, కుల ధ్రువీకరణ పత్రాలు సమర్పించక పోయిన పక్షంలో నామినేషన్ల పరిశీలన సమయం వరకు అందించవచ్చని తెలిపారు. తిప్పర్తి మండలంలో నామినేషన్ కేంద్రాల తనిఖీ శుక్రవారం జిల్లా కలెక్టర్ తిప్పర్తి మండలంలోని తిప్పర్తి, మామిడాల, పజ్జురు గ్రామ పంచాయతీలలో మొదటి విడత నామినేషన్ స్వీకరణ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ ఫారాలు, హెల్ప్ డెస్క్ ద్వారా సహాయం ఈ సందర్భంగా, ఇప్పటివరకు వచ్చిన నామినేషన్లు, అభ్యర్థులకు ఎదురయ్యే సమస్యలు, హెల్ప్ డెస్క్ ద్వారా సూచిస్తున్న వివరాలు, ఇతర అవసరాలను అడిగి తెలుసుకున్నారు.అభ్యర్థుల నామినేషన్ ఫారాలను క్షుణ్ణంగా పరిశీలించాలి, ఒక...