జిల్లా పోలీసు కార్యాలయంలో ఉద్యోగవిరమణ పొందిన పోలీసు సిబ్బందికి ఘన సన్మానం కుటుంబ సభ్యుల సమక్షంలో శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ కె. నరసింహ
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 29 జిల్లాలో పోలీసు శాఖలో సుదీర్ఘకాలం సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందిన పోలీసు అధికారులకు శనివారం జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపిఎస్ గారు పాల్గొని ఉద్యోగ విరమణ పొందిన పోలీసు సిబ్బందిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఉద్యోగవిరమణ పొందిన అధికారుల వివరాలు ఉద్యోగవిరమణ పొందిన వారిలో స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐ: పులి వెంకటేశ్వర్లు,ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ: జానకిరాములు,డిసిఆర్బి ఏఎస్ఐ: కృష్ణా రెడ్డి,ఏఎస్ఐ: ఇస్మాయిల్ ఉన్నారు.వీరిలో పులి వెంకటేశ్వర్లు, కృష్ణా రెడ్డి, ఇస్మాయిల్ గార్లు స్వచ్ఛంద పదవి విరమణ చేసినట్లు అధికారులు తెలిపారు.పోలీసు...