ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలి నామినేషన్ కేంద్రాల పరిశీలన చేసిన జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, నవంబర్ 30 ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పక పాటించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కోరారు.సూర్యాపేట మండలం ఇమాంపేట గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.తదుపరి మునగాల, నడిగూడెం గ్రామపంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్ల ఎన్నికల నిమిత్తం నామినేషన్ స్వీకరణ కేంద్రాలను ఆదివారం కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెన్ పహాడ్, చివ్వేంల, మోతే, మునగాల, నడిగూడెం, కోదాడ, చిలుకూరు, అనంతగిరి మండలాల్లోని 181 గ్రామపంచాయతీలు, 1,628 వార్డు...