ఎన్నికల నామినేషన్లపై కలెక్టర్ సూచన ప్రజల, అధికారుల సహకారం అవసరం
సూర్యాపేట బ్యూరో, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 1 జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి అధికారులు, ప్రజలు పూర్తి స్థాయి సహకారం అందించాలని కోరారు. నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షణ మోతే, రాఘవ పురం, చివ్వేంల మండలాల బండమీది చందుపట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించి, సంబంధిత అధికారులు కు సూచనలు అందించారు. రెండో విడత నామినేషన్లు జిల్లా మొత్తం 8 మండలాల్లో రెండో విడత కింద 181 గ్రామ సర్పంచ్, 1628 వార్డు సభ్యుల నామినేషన్లు 49 కేంద్రాల్లో స్వీకరిస్తున్నారు. మంగళవారం రెండో విడత నామినేషన్ చివరి రోజు కావడంతో, అభ్యర్థులు...