బీజేపీ సర్పంచ్ అభ్యర్థులకు పవన్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు గ్రామాభివృద్ధికి పంచాయతీలకు బలం కావాలి” – మాజి మండల పార్టీ అధ్యక్షులు

నేరేడు చర్ల, డైనమిక్ న్యూస్, డిసెంబర్ 4 మూడవ దశలో నామినేషన్ దాఖలు చేస్తున్న బీజేపీ సర్పంచ్ అభ్యర్థులకు మాజి మండల పార్టీ అధ్యక్షులు గొడ్డేటి పవన్ కుమార్ యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాభివృద్ధి జరగాలంటే పంచాయతీ వ్యవస్థకు పటిష్ఠత అవసరమని అన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యమే గ్రామాల దుస్థితికి కారణం గత ప్రభుత్వాలు పంచాయతీలకు తగిన నిధులు కేటాయించకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి నిలిచిపోయిందని పవన్ కుమార్ యాదవ్ విమర్శించారు.నీటి సమస్యలు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక వసతుల లోపాలతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కేంద్ర నిధులతోనే అభివృద్ధి పనులు ప్రస్తుతం గ్రామాల్లో కనిపిస్తున్న...