సూర్యాపేటలో ఘనంగా 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం పరేడ్‌కు గౌరవ వందనం స్వీకరించిన జిల్లా ఎస్పీ నరసింహ హోంగార్డుల సేవలు వెలకట్టలేనివి – జిల్లా ఎస్పీ ప్రశంస

సూర్యాపేట బ్యూరో, డిసెంబర్ 6 , డైనమిక్ న్యూస్ భద్రతా వ్యవస్థలో హోంగార్డు సేవలు వెలకట్టలేనివని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ అన్నారు. 63వ హోంగార్డు వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయం పరిధిలో హోంగార్డు అధికారులు ఘనంగా పరేడ్ నిర్వహించారు.జిల్లా ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించి పరేడ్‌ను తిలకించారు. ఈ సందర్భంగా హోంగార్డు అధికారులకు జిల్లా ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు. పోలీసులకు దీటుగా హోంగార్డ్స్ విధులు ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ మాట్లాడుతూ పూర్తి స్థాయి శిక్షణ పొందిన పోలీసు సిబ్బందితో సమానంగా హోంగార్డులు విధులు నిర్వర్తిస్తున్నారని అన్నారు. కొన్ని సందర్భాల్లో పోలీసుల కంటే మెరుగ్గా హోంగార్డులు...